Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:32 AM

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

14-01-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మున్సిపాలిటీ పట్టణంలో భోగి పండుగను పురస్కరించుకుని క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానోత్సవాన్ని దాతలైన గోస్కొండ మల్లయ్య మరియు గోస్కొండ నవీన్ స్మారకార్థంగా ఏర్పాటు చేశారు.

విజేతలకు అందించిన బహుమతులను గోస్కొండ శ్రీనివాస్ స్పాన్సర్ చేయగా, పోలేపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు.

ఈ టోర్నమెంట్‌లో కుక్కల టిల్లు టీమ్ ప్రథమ బహుమతిని, పాల వేణు టీమ్ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నాయి. విజేతలకు మెడల్స్, షీల్డ్స్ అందజేశారు. మొదటి విజేత టీమ్ కెప్టెన్ కుక్కల టిల్లు మరియు ఆయన టీమ్ సభ్యులను ముఖ్య అతిథులు అభినందించారు.

ఈ సందర్భంగా పోలేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు చదువుల్లో కూడా రాణించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో బోడ శ్రీనివాస్, దేశపాక రాజేష్, పోకల మహేష్, పాల బాలకృష్ణ, జిట్టా స్వామి, పాల శివ, పాల యాదయ్య, బోడ రాకేష్, పాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భోగి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News