Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:30 PM

భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

14-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

భోగభాగ్యాలు అందించే భోగి పండుగ ప్రజల జీవితాల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలని నకిరేకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం ఆకాంక్షించారు. భోగి పండుగ సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన భోగి మంటలు కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గంగిరెద్దుల ఆట విన్యాసాలను ఆయన ఆసక్తిగా తిలకించారు. అనంతరం సంప్రదాయ పద్ధతుల్లో మొక్కులు చెల్లించి, భోగి పండుగ ప్రాముఖ్యతను వివరించారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ…

భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని తెలిపారు. ఈ పండుగలను ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. భోగి మంటలతో పాతదాన్ని విడిచిపెట్టి, కొత్త ఆశలు, ఆశయాలతో ముందుకు సాగాలన్నారు.

ప్రతి ఇంటా సుఖశాంతులు నెలకొనాలని, రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. ఈ పండుగలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యేకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News