Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన నల్లపోచమ్మ అమ్మవారు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 07:46 AM

భూభారతిలో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

10-01-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

బీబీ నగర్ మండలలో తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి,భూభారతి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు,సిబ్బందితో సమీక్ష జరిపారు. మండలంలోని ఒక్కో గ్రామం వారీగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను,సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అన్నారు. అర్జీలను తిరస్కరించినట్లైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్నచిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని,అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని హితవు పలికారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా,పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని,భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పని చేయాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

భూభారతిలో పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ హనుమంత రావు

Article Image
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

బీబీ నగర్ మండలలో తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి,భూభారతి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు,సిబ్బందితో సమీక్ష జరిపారు. మండలంలోని ఒక్కో గ్రామం వారీగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను,సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అన్నారు. అర్జీలను తిరస్కరించినట్లైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్నచిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని,అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని హితవు పలికారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా,పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని,భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పని చేయాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల తాసిల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News