Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

భిక్షాటనతో ఏబీవీపీ నిరసన: స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్

10-04-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ, ఏప్రిల్ 10: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ప్రధాన పురవీధుల్లో విద్యార్థులు భిక్షాటన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ నల్లగొండ నగర సంయుక్త కార్యదర్శి బత్తుల శివ చరణ్ మాట్లాడుతూ, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి విద్యార్థులకు రావాల్సిన సుమారు రూ. 9,000 కోట్ల స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు ఇవ్వలేని ప్రభుత్వం విద్య గురించి మాట్లాడే అర్హత కోల్పోయిందని ఆయన విమర్శించారు.

వేల కోట్ల బకాయిలను నిలిపివేయడం వల్ల విద్యార్థులు అప్పుల బారిన పడుతున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ పథకాలను నిలిపివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అలాంటి చర్యలు కొనసాగితే ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉధృత ఆందోళనలు చేపడతామని, అవసరమైతే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు సిద్ధు, శివ, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భిక్షాటనతో ఏబీవీపీ నిరసన: స్కాలర్‌షిప్ బకాయిల విడుదలకు డిమాండ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News