Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:55 AM

భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే

భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే

భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే
19-01-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మెగా డిజిటల్ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

ప్రస్తుతం కొనసాగుతున్న మొబైల్ యుగంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమాచార రంగంలో ప్రజలకు అత్యంత తక్కువ సమయంలో అత్యధిక మందికి చేరువయ్యే డిజిటల్ మీడియానే ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారని, భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదేనని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి అన్నారు. హుజూర్నగర్‌కు చెందిన జర్నలిస్టు చిలక సైదులు ఆధ్వర్యంలో రూపొందించిన మెగా డిజిటల్ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో అసోసియేషన్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా సమాచార వ్యవస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఎప్పటికప్పుడు తమను తాము నవీకరించుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమాచారం అందించే విధంగా వార్తలు రూపొందించాలని తెలిపారు. సమాజం వేగంగా మారుతున్న నేపథ్యంలో ఇంకా పాత పద్ధతులకే పరిమితమవ్వకుండా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. మీడియా రంగంలోకి నూతనంగా వచ్చే వారిని అనుభవజ్ఞులు ప్రోత్సహించి ముందుకు నడిపించాలని కోరారు. ఈ సందర్భంగా క్యాలెండర్ రూపొందించిన జర్నలిస్టు చిలక సైదులును అభినందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దుర్గం బాలు, సూర్యాపేట జిల్లా సహాయ కార్యదర్శి తిరుపతి శ్రీనివాస్, సూర్యాపేట నియోజకవర్గ అసోసియేషన్ నాయకులు వంశీకృష్ణ శర్మ, కొండ రవి, కుంచం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భవిష్యత్తు అంతా డిజిటల్ మీడియాదే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News