Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:03 AM

భ్రూణ హత్యలు చేయడమంటే....అది మానవత్వంపై దాడి చేయడమే...

భ్రూణ హత్యలు చేయడమంటే....అది మానవత్వంపై దాడి చేయడమే...

భ్రూణ హత్యలు చేయడమంటే....అది మానవత్వంపై దాడి చేయడమే...
February 20, 2026 10:27 AM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఆడపిల్ల పుట్టుకను ఆపడం అంటే..... రేపటి ఊపిరిని ఆపేయడమే...

గ్రామస్థాయి నుండే లింగ వివక్షతకు అడుగులు పడాలి

ఆడబిడ్డను కాపాడుకుందాం...లింగ వివక్షను రూపు మాపుదాం

లింగ సమానత్వ కన్వర్టెన్సీ సమావేశంలో......

డిఎంహెచ్ ఓ మనోహర్ రావు,

శిశు సంక్షేమ అధికారి నరసింహారావు

అమ్మ కావాలి... భార్య కావాలి... చెల్లి కావాలి...కానీ కూతురు మాత్రమే వద్దు...ప్రాణం పోసే శక్తిని ప్రాణం తీసే హక్కుగా మార్చుకోవడం చట్ట రిత్యా నేరమని,ఇది ప్రతి తల్లిదండ్రులు గుర్తించాలని,భ్రూణ హత్యలు నివారణ గ్రామ స్థాయి నుండి పునాది పడాలని

డిఎంహెచ్ ఓ మనోహర్రావు, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి నరసింహారావులు అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం షార్ప్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రమీల అధ్యక్షతన స్థానిక హౌసింగ్ బోర్డ్ లోని డిస్కో మినీ ఫంక్షన్ హాల్ లో కన్వర్టెన్సీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు,జిల్లా వైద్యాధికారి డాక్టర్ మనోహర్,టౌన్ ఎస్ఐ ఓ సంధ్య, డిపిఓ రేవేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...లింగ సమానత్వం అనే అంశాన్ని అధికారులు ఏరకంగా గ్రామస్థాయిలో ఉన్నటువంటి కమిటీలు దీని రూపుమాపాలని అనే ముందు మార్పు అనేది కమిటీల కాగితాల్లోనే కాదు...ప్రతి ఇంటి గడప నుండి మొదలవ్వాలని ఆడపిల్ల పుట్టుకను ఆపడం అంటే రేపటి ప్రపంచానికి ఊపిరి ఆపడేమని అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరు తమ ఇంటిలో మగ పిల్లవాడికి ఇచ్చే ప్రాధాన్యతను ఆడపిల్ల కు సమానంగా ఉండే విధంగా గుర్తించాలని కోరారు. లింగ వివక్షను వీడి ఆడబిడ్డ పుట్టడం హాక్కుగా స్వీకరించినప్పుడే సమాజం లోని మానవ విలువలు అభివృద్ధి చెందుతాయి అన్నారు.ఉచిత కాల్ సెంటర్ 15 100 సమాచారం ఇవ్వాలని వారి పేర్లు గోప్యంగా ఉంటాయని తెలిపారు. ఇలాంటి సంఘటనలు గుర్తించిన తెలిసిన మీ వంతు బాధ్యతగా ప్రభుత్వ సంస్థలకు అందుబాటులో ఉన్న అంగన్వాడీ ఆశ స్వచ్ఛంద సంస్థలకు సమాచారం ఇవ్వాలని కోరారు.సామాజికంగా ఎదురయ్యే సమస్యల కోసం మన వంతు బాధ్యతగా లింగ సమానత్వం సాధన చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.గృహ హింస, నిరోధక చట్టం అవగాహన కమిటీలు ప్రేమ్ కమిటీలు బలోపేతం చేయాలని అన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు.సఖి అడ్మిన్ సఖి సర్వీసెస్ సేవలను వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లీగల్ డిఫెన్స్ అధికారి సాయి శ్రీనివాస్,ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు బి సుదర్శన్,మెడికల్ ఆఫీసర్ నిరోషా,ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎం కవిత,కౌన్సిలర్ శోభ,జి.రాజేష్, సరిత,వరలక్ష్మి,ప్రోగ్రాం,మేనేజర్ శ్రీనివాసరావు,మహిళా సంఘాలు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News