Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:33 AM

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి

09-03-2026 241 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో అఖిల భారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ భారత రాష్ట్రపతికి మెమోరాండం పంపించే కార్యక్రమంలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతుల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వాణిజ్య మంత్రి చేసిన ప్రకటనలు చూస్తే అమెరికాకు భారత పాలకులు తలవంచినట్లుగా ఉందని విమర్శించారు. భారతీయ ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికాలో సుంకాలు పెంచడం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని అన్నారు.

అమెరికా నుండి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు ఎత్తివేయడం వల్ల దేశీయ రైతులు పోటీకి తట్టుకోలేక పండించిన పంటలను అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. దీంతో రైతాంగం ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మొక్కజొన్న, సోయాబీన్, పాల ఉత్పత్తి చేసే రైతులు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడతారని పేర్కొన్నారు.

అమెరికా నుండి ప్రతి సంవత్సరం 100 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేయడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించాలని, రైతులకు రుణ విమోచన చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో చాట్రాయి మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, వేముల బక్కయ్య, భవాని, కలపాల జ్యోతి, ఆడుమల్లి వెంకటేశ్వరరావు, చిట్టిపాటి పుల్లారావు, కొత్తపల్లి సోమేశ్వరరావు, కొత్తపల్లి ప్రసాద్, రాము, కలపాల సోమయ్య, ఆడుమిల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News