Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి ప్రభుత్వం ఉచితంగా అందించాలి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు

భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి ప్రభుత్వం ఉచితంగా అందించాలి గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు

భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంటికి ప్రభుత్వం ఉచితంగా అందించాలి  గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ కృష్ణ బంటు
January 26, 2026 06:21 PM 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లాలో భారత రాజ్యాంగ రథయాత్రకు ఘన ప్రారంభం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

భారత రాజ్యాంగ ప్రతిని ప్రతి ఇంటికి ప్రభుత్వమే ఉచితంగా అందించాలని సీనియర్ జర్నలిస్ట్, గోల్డ్ మెడలిస్ట్, అంబేద్కరిస్ట్ డాక్టర్ బంటు కృష్ణ డిమాండ్ చేశారు. 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లాలో నిర్వహిస్తున్న భారత రాజ్యాంగ రథయాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.సోమవారం రైతు బజార్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ రథయాత్రను జిల్లా జేఏసీ కన్వీనర్ డి విజయరామరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బంటు కృష్ణ మాట్లాడుతూ కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటిలో రామాయణం, భారతం, ఖురాను, బైబిల్ ఉన్నట్టుగానే అన్ని మతాలకు అతీతంగా ప్రతి ఇంటిలో రాజ్యాంగం కూడా ఉండాలని స్పష్టం చేశారు.ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం దేశానికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు, ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిందని కొనియాడారు. ప్రతి ఒక్కరూ చదువుకుని విద్యావంతులు కావాలని, విద్య మాత్రమే మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని వివరించారు. విజ్ఞానవంతులైన మానవులు మానవత్వంతో కలిసిమెలిసి జీవించాలని, మనిషిని మనిషిగా చూసే సమసమాజం కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుందని అన్నారు.గౌరవ అతిథిగా పాల్గొన్న తెలంగాణ మాదిగ దండోరా రాష్ట్ర అధ్యక్షుడు చిప్పలపల్లి జయశంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ చైర్మన్ డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో ఈ రాజ్యాంగ రథయాత్రను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వాలు తప్పకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన అందించాలని డిమాండ్ చేశారు.

విశిష్ట అతిథులుగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టులు భూపతి రాములు, కందుకూరి యాదగిరి, సుంకరబోయిన వెంకటయ్య, రాము తదితరులు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను మసకబార్చే ఏ చర్యనైనా ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.స్వాతంత్ర్యం వేరు – గణతంత్రం వేరు, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి, రాజ్యాంగం ప్రతి ఇంటిలోఉండాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ర్యాలీ కొనసాగింది.ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు సూరపల్లి సైదులు, జిల్లా నాయకులు అల్వాల ఉపేందర్ ముదిరాజ్, వంశీ, రజక, శివకుమార్ యాదవ్, కొండమీద శ్రీనివాస్, రమేష్, భాస్కర్, పేరాల శ్రీనివాస్, ఔరెండ్ల నాగేంద్రబాబు, రాము, అంబేద్కర్ ఎస్ విష్ణు, డీఎస్యూవీ విద్యార్థి నాయకులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సైదులు, సతీష్, అజీజ్, జహీర్, మోహిన్, గౌసుద్దీన్, చాంద్, వెంకట్, ఆనంద్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు తదితరులు పాల్గొని రథయాత్రను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News