Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అనిల్ గోండాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 07:55 PM

భక్తులందరిపై శివయ్య ఆశీస్సులు ఉండాలి

భక్తులందరిపై శివయ్య ఆశీస్సులు ఉండాలి

భక్తులందరిపై శివయ్య ఆశీస్సులు ఉండాలి
16-02-2026 361 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

శివరాత్రి జనజాగరణలో సాంస్కృతిక కార్యక్రమాలు

దేవాలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న గౌడ్, బచ్చలకూరి శ్రీనివాస్

సూర్యాపేట భక్తులందరిపై శివయ్య కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని దేవాలయ కమిటీ చైర్మన్ కొండ వెంకన్న గౌడ్ , 12వ వార్డు పురపాలక మాజీ కౌన్సిలర్ బచ్చలకూరి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఆదివారం రాత్రి మహాశివరాత్రి సందర్భంగా జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో ఉన్న పిల్లలమర్రి ఎరకేశ్వరాలయంలో నిర్వహించిన జనజాగరణ కార్యక్రమాలను వారు ప్రారంభించి మాట్లాడారు. ప్రజలందరూ పాడిపంటలతో సుఖసంతోషాలతో జీవించాలని, శివుని ఆశీస్సులు ప్రతి ఇంటిపై ప్రసరించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శివరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.పిల్లలమర్రి దేవాలయాలు భక్తజన సందోహంతో కళకళలాడాయి. శివనామస్మరణతో దేవాలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు రాత్రంతా జాగరణ చేసి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిలుక ఆనంద్, చెరుకుపల్లి బుచ్చి రాములు, చిత్తలూరి పూజిత, ఓ బల్లోజు తేజస్విని, వల్లాల జానీ, షేక్ జానీ మియా , రాయల సైదులు, చెరుకుపల్లి కృష్ణ , లంజపల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భక్తులందరిపై శివయ్య ఆశీస్సులు ఉండాలి

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News