Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెరువుగట్టులో పార్వతి జడల రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 12:36 PM

భక్తుల రద్దీకి ముందస్తు జాగ్రత్తలు – బారికేడ్లు ఏర్పాటు చేయనున్న దాతలు

24-03-2026 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో,మంజీర నది ఒడ్డున వెలసిన ప్రసిద్ధ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే 7 వారాల మహా జాతరకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.ఈ జాతరకు పరిసర గ్రామాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు.భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆలయ నిర్వాహకులు భావించారు. ఈ క్రమంలో హైదరాబాద్ చందానగర్‌కు చెందిన నత్తు & సన్స్ జువెల్లరి సంస్థ ప్రముఖ బంగారం వ్యాపారులు రాజు రిజ్వానీ, రాజేష్ రిజ్వాని, సూరజ్ రిజ్వాని గారు స్పందించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆలయ పరిసరాల్లో భారీ బారికేడ్లు (బారిగేట్లు) ఏర్పాటు చేయించడంతో పాటు అవసరమైన బ్యానర్లు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.వారి సహకారానికి కృతజ్ఞతగా ఈ రోజు ఆలయ సిబ్బంది శేఖర్ వారికి శాలువ కప్పి సత్కరించారు.అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి ఆశీర్వాదం పొందేలా చేశారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ, భక్తుల సౌకర్యం కోసం ముందుకొచ్చిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.భక్తులు సురక్షితంగా,సౌకర్యంగా జాతరలో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేపడుతున్నామని వెల్లడించారు.

Sthanikam

భక్తుల రద్దీకి ముందస్తు జాగ్రత్తలు – బారికేడ్లు ఏర్పాటు చేయనున్న దాతలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News