Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

భగత్ సింగ్ స్ఫూర్తితో సమానత్వ సమాజం నిర్మాణం

23-03-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్‌లో ఘనంగా 95వ వర్ధంతి – ఏఐవైఎఫ్ నేతల నివాళులు

భారత స్వాతంత్రోద్యమంలో అజరామరమైన త్యాగస్ఫూర్తిని చాటిన విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, వందల ఏళ్ల పాటు భారతదేశాన్ని ఆక్రమించిన ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా భగత్ సింగ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.

కేవలం 23 ఏళ్ల వయసులోనే ఉరికంబాన్ని చిరునవ్వుతో ఆహ్వానిస్తూ దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన మహానుభావుడని కొనియాడారు. కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా దేశ ప్రజలందరూ ఒక్కటేనని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిత్వం భగత్ సింగ్‌దని తెలిపారు.భగత్ సింగ్ వర్ధంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొత్త చట్టం అవసరం దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి “భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ చట్టాన్ని తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపాలిటీ శాఖ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, బద్దుల సుధాకర్, రొండి నర్సింహా, టంగుటూరు రాములు, దాసరి మనోహర్, దాసరి సిద్దు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భగత్ సింగ్ స్ఫూర్తితో సమానత్వ సమాజం నిర్మాణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News