Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

భగత్ సింగ్ స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్

23-03-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

బహుమతుల ప్రధానోత్సవం – యువతకు మార్గదర్శక సందేశాలు

విప్లవ వీరుడు భగత్ సింగ్ స్ఫూర్తితో భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవం చౌటుప్పల్ ప్రాంతంలో ఘనంగా జరిగింది.గత వారం రోజులుగా కొనసాగిన ఈ టోర్నమెంట్‌లో దాదాపు 13 గ్రామాల జట్లు పాల్గొన్నాయి. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులుగా కౌన్సిలర్లు బత్తుల జయమ్మ దాసు, అలె చిరంజీవి హాజరై వారు మాట్లాడుతూ, భగత్ సింగ్ స్ఫూర్తితో యువత ఎల్లప్పుడూ సమాజానికి ఉపయోగపడే దిశగా ముందుండాలని సూచించారు. యువత చెడు వ్యసనాలకు, ముఖ్యంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, క్రీడలు, మంచి అలవాట్లపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.విజేతలకు బహుమతులు మొదటి విజేతగా రంగారెడ్డి మల్కాపురం జట్టు నిలవగా, రెండో విజేతగా శ్రీకాంత్ తంగడపల్లి జట్టు నిలిచింది.ఈ కార్యక్రమంలో సిపిఎం మున్సిపల్ నాయకులు బండారి నరసింహ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ బోయ లింగస్వామి, టోర్నమెంట్ నిర్వాహకులు తోర్పునూరి మల్లేష్ గౌడ్, నక్క లింగస్వామి, లగోని లింగస్వామి, రొట్ట అనిల్ కుమార్, రాజ్ పెరియర్, బోయ అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భగత్ సింగ్ స్ఫూర్తితో క్రికెట్ టోర్నమెంట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News