Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:13 PM

బెట్టింగ్ భూతానికి చెక్ పెట్టండి… బతుకును బలి చేయొద్దు –చాట్రాయి ఎస్‌ఐ రామకృష్ణ ఘాటు హెచ్చరిక!

బెట్టింగ్ భూతానికి చెక్ పెట్టండి… బతుకును బలి చేయొద్దు –చాట్రాయి ఎస్‌ఐ రామకృష్ణ ఘాటు హెచ్చరిక!

బెట్టింగ్ భూతానికి చెక్ పెట్టండి… బతుకును బలి చేయొద్దు –చాట్రాయి ఎస్‌ఐ రామకృష్ణ ఘాటు హెచ్చరిక!
March 30, 2026 08:22 AM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న డి. రామకృష్ణ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నేపథ్యంలో ప్రజలకు గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. “క్రికెట్‌ను కేవలం ఆటగా ఆస్వాదించాలి… బెట్టింగ్ అనే మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు” అని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ— గతంలో “#SayNoToBettingApps” ప్రచారం ద్వారా వందలాది బెట్టింగ్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, కొందరు అక్రమ నిర్వాహకులు కొత్త మార్గాల్లో దందాను కొనసాగిస్తున్నారని తెలిపారు. టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా యువతను టార్గెట్ చేస్తూ బెట్టింగ్ ఉచ్చులోకి లాగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

డబ్బు కోసం ఆకర్షణీయమైన ఆఫర్లు, “గెలిస్తే భారీ లాభాలు” అనే ప్రలోభాలతో ఇన్ఫ్లూయెన్సర్లు ప్రమోషన్ చేస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ రామకృష్ణ హెచ్చరించారు. ఆన్‌లైన్‌తో పాటు ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో జరుగుతున్న ఆఫ్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

బెట్టింగ్ వ్యసనంతో అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, యువత ఈ ప్రమాదకర మార్గానికి దూరంగా ఉండాలని ఆయన సూచించారు. “ఒక్కసారి ఈ ఉచ్చులో పడితే బయటపడటం కష్టం” అంటూ ఆయన హెచ్చరించారు.

పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నూజివీడు నియోజకవర్గం పరిధిలో అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు బెట్టింగ్, జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నారని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు, సమాజాన్ని సురక్షితంగా ఉంచేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News