Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:46 PM

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ అణచివేతపై తీవ్ర విమర్శలు

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ అణచివేతపై తీవ్ర విమర్శలు

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రాజకీయ అణచివేతపై తీవ్ర విమర్శలు
February 16, 2026 09:00 PM 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ ఆరోపణలు

సూర్యాపేటలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా బాధ్యుడు వట్టె జానయ్య యాదవ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై జరుగుతున్న రాజకీయ అన్యాయాలపై తీవ్రంగా స్పందించారు. సూర్యాపేట పురపాలక సంస్థ పరిధిలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను రాజకీయంగా అణచివేస్తున్నాయని ఆరోపించారు. సంవత్సరాల తరబడి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు సమయం వచ్చినప్పుడు పదవులు ఇవ్వకుండా అగ్రవర్ణ కాంట్రాక్టర్లు, ప్రభావశీల వర్గాలకు అవకాశాలు కల్పిస్తున్నారని విమర్శించారు.

పురపాలక సంస్థలో గెలిచిన బీసీ ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం, అవకాశాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ మాట నిలబెట్టుకుందా అని నిలదీశారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నట్లు నటిస్తూ కీలక సందర్భాల్లో ఒకటై బీసీల ఎదుగుదలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. పదేళ్లపాటు జరిగిన దోపిడీపై ప్రశ్నించని వారు ఇప్పటికీ రాజకీయ లాభాల కోసం కలిసి పనిచేస్తున్నారని అన్నారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ తొంభై ఐదు శాతం ప్రజావర్గాలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. “మార్పు రావాలని కోరుకోవడం సరిపోదు… మనం మారితేనే మన పరిస్థితులు మారుతాయి” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, కార్యదర్శి నారాయణ దాసు కవిత, పట్టణ కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మాజీ మార్కెట్ డైరెక్టర్ మురళి, వట్యాల శేఖర్, చామల, సుమన్, దీపమాల, బొల్లెద్దు అనిత, గట్టు గోపి, రఘు మోహన్, వంశీ, సురేష్, రంప శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News