Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:30 AM

బెల్ట్ షాపుల మూసివేతకు లింగరాజు పల్లి గ్రామస్తుల తీర్మానం

02-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

: యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వలిగొండ మండలంలోని లింగరాజు పల్లి గ్రామంలో బెల్టు షాపులు మూసివేయాలని గ్రామ‌స్తులు తీర్మానించారు.గ్రామానికి చెందిన నాయకులు ఆదివారం పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామపంచాయతీ పాలకవర్గం, మహిళలంతా సమావేశమై అందరి సమక్షంలో ఈ తీర్మానం చేశారు. బెల్ట్ షాపుల నుండి మద్యం అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ నాయ‌కులు మాట్లాడుతూ మ‌ద్యం విచ్చ‌ల‌విడిగా బెల్టు షాపుల్లో ల‌భిస్తుండ‌డంతో స్థానిక యువకులు మద్యానికి బానిసలవుతున్న‌ట్లు తెలిపారు. ప‌లువురు రోగాలు, ప్రమాదాల భారిన ప‌డుతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో అంద‌రి ఆకాంక్ష మేర‌కు బెల్డ్ షాపుల మూసివేత నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడిగే లింగస్వామి, మాజీ సర్పంచ్ మైసయ్య, ఉపసర్పంచ్ బంగపట్ల జయ, వార్డు మెంబర్లు,సెక్రెటరీ తండ రేణుక గ్రామ ప్రజలు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బెల్ట్ షాపుల మూసివేతకు లింగరాజు పల్లి గ్రామస్తుల తీర్మానం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News