Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 05:31 AM

బెల్లయ్య నాయక్‌కు రాజ్యసభ స్థానం కల్పించాలి

20-02-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్

సూర్యాపేట: తెజావత్ బెల్లయ్య నాయక్‌కు పార్లమెంట్ సభ్య స్థానం ఇచ్చి రాజ్యసభకు పంపించాలని లంబాడి హక్కుల పోరాట సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు నాయక్ కోరారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనుల హక్కుల కోసం ముప్పై ఏళ్లుగా నిరంతరంగా పోరాటం చేస్తున్న బెల్లయ్య నాయక్‌కు రాజ్యసభ స్థానం ఇవ్వడం ద్వారా గిరిజన సమాజానికి న్యాయం చేయాలని అన్నారు. ఇరవై ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం రాజీ లేని ఉద్యమాలు నిర్వహించిన నాయకుడిగా ఆయన సేవలను గుర్తించాలని సూచించారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధన కోసం నిర్వహించిన పాదయాత్రను గుర్తుచేస్తూ, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే నాయకుడని పేర్కొన్నారు. రెండువేల ఇరవై మూడు సంవత్సరంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీన పరిస్థితుల్లో ఉన్న సమయంలో పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్రలో కాశ్మీర్ వరకు పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెల్లయ్య నాయక్‌ను గిరిజన సహకార సంస్థ అధ్యక్షునిగా నియమించారని, ఆ పదవిలో తెలంగాణ గిరిజనుల అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో మగ్త నాయక్, భూక్య వెంకటేష్ నాయక్, అశోక్ నాయక్, సురేష్ నాయక్, అంగోతు శ్రీకాంత్ నాయక్, భావిక్ నాయక్, హార్దిక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బెల్లయ్య నాయక్‌కు రాజ్యసభ స్థానం కల్పించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News