Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

బీసీల రాజ్యాధికారాన్ని అడ్డుకునే కుట్ర

బీసీల రాజ్యాధికారాన్ని అడ్డుకునే కుట్ర

బీసీల రాజ్యాధికారాన్ని అడ్డుకునే కుట్ర
20-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మున్సిపల్ ఎన్నికల్లో తగ్గించిన రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ కాగితాలకే

- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే

- మున్సిపల్ ఎన్నికల్లో బీసీలను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

- బీసీ సంక్షేమ సంఘం తీవ్ర ఆగ్రహం

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ,బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి,కార్యనిర్వాహక అధ్యక్షులు గొట్టిపాముల బాబు రావు మాట్లాడుతూ...రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ స్వయంగా ప్రకటించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని తీవ్రంగా విమర్శించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీసీలకు కేవలం 17 శాతం మాత్రమే రిజర్వేషన్లు ప్రకటించి,బీసీలను రాజ్యాధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు.అదే తరహాలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీసీల రిజర్వేషన్లను తగ్గించి మరోసారి బీసీ వర్గాలను మోసం చేయడం దారుణమని అన్నారు.బీసీలు రాష్ట్ర జనాభాలో మెజారిటీగా ఉన్నప్పటికీ,వారికి తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా ఎన్నికలు నిర్వహించడం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని,ఇది బీసీ సమాజం ఎన్నటికీ అంగీకరించదని హెచ్చరించారు.ఇప్పటికైనా ఎన్నికలకు సమయం ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించి,బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో

రాష్ట్ర కార్యదర్శి, మాజీ మున్సిపల్ చైర్మన్ పెంట నరసింహ ముదిరాజ్,

ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు మాటూరి అశోక్,నియోజకవర్గ అధ్యక్షులు సాబన్ కార్ వెంకటేష్,మండల అధ్యక్షులు చిన్న మల్లేష్,యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు అశోక చారి,రజక సంఘం జిల్లా నాయకులు సిరికొండ శివకుమార్,మాజీ కౌన్సిలర్ తాడూరు బిక్షపతి ప్రజాపతి,కొండ శ్రవణ్ కుమార్ తదితర బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీల రాజ్యాధికారాన్ని అడ్డుకునే కుట్ర

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News