Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:24 AM

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా
03-02-2026 103 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాజ్యాధికార పార్టీ ముందడుగు

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు బీ ఫారమ్‌ల అందజేత

బీసీల రాజకీయ రాజ్యాధికారమే లక్ష్యంగా రెండు నర కోట్ల ప్రజల ఆశయంగా ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వార్డు అభ్యర్థులకు బీ ఫారమ్‌లను అందజేసింది. పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ అభ్యర్థులకు బీ ఫారమ్‌లు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తమ తమ వార్డుల్లో గట్టిగా ప్రచారం నిర్వహించి పార్టీ గుర్తును ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.అనంతరం అభ్యర్థులందరూ పార్టీ కార్యాలయం నుంచి సూర్యాపేట పురపాలక సంఘం కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి బీ ఫారమ్‌లను అధికారికంగా సమర్పించారు.

ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల రాజకీయ హక్కుల కోసం ఏర్పడిన ప్రజల పార్టీ అని తెలిపారు. సమాన న్యాయం, పేద ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పార్టీ పనిచేస్తోందన్నారు. ఇప్పటివరకు అగ్రకులాల పార్టీల వద్ద బీ ఫారమ్‌ల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల నాయకులు ఎదురుచూపులు, అవమానాలు ఎదుర్కొన్నారని, అయినా రాజకీయ న్యాయం జరగలేదని విమర్శించారు. ఈసారి ప్రజల స్వంత పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మద్దతు ఇచ్చి రాజకీయ మార్పుకు నాంది పలకాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లంకొండ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల గౌడ్, ప్రధాన కార్యదర్శి నారాయణదాసు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ మురళి తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News