Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 11:43 AM

బీఎస్‌ఎన్‌ఎల్–వొడాఫోన్ ఐడియా కలయిక… టెలికాం రంగంలో కొత్త సమీకరణాలు

22-03-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

దేశీయ టెలికాం రంగంలో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) మరియు ప్రైవేట్ టెలికాం దిగ్గజం వొడాఫోన్ ఐడియా (Vi) పరస్పర సహకారంతో ముందుకు సాగేందుకు వ్యూహాత్మక ఒప్పందం దిశగా అడుగులు వేస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఇరు సంస్థల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఒప్పందం ప్రకారం, బీఎస్‌ఎన్‌ఎల్ మరియు వొడాఫోన్ ఐడియా తమకు ఉన్న మొబైల్ టవర్లు, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్‌ను సంయుక్తంగావినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. అంతేకాకుండా, స్పెక్ట్రమ్ వనరులను కూడా పరస్పరం పంచుకోవడం ద్వారా నెట్‌వర్క్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం టెలికాం రంగంలో పెరుగుతున్న వ్యయభారం నేపథ్యంలో, మౌలిక వసతుల ఏర్పాటు కోసం అయ్యే ఖర్చులను తగ్గించుకోవడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. వనరుల భాగస్వామ్యం ద్వారా తక్కువ వ్యయంతో విస్తృత కవరేజీ సాధించడం వీటి వ్యూహంలో కీలక అంశంగా నిలుస్తోంది.ఈ భాగస్వామ్యం ఫలితంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ పరిధి పెరగడంతో పాటు సిగ్నల్ సమస్యలు తగ్గే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాల్ డ్రాప్స్ తగ్గడం, డేటా వేగం పెరగడం, సేవల నాణ్యత మెరుగుపడడం వంటి ప్రయోజనాలు వినియోగదారులకు అందే అవకాశముంది.ఇప్పటికే మార్కెట్‌లో దూసుకుపోతున్న ఇతర టెలికాం సంస్థల పోటీని ఎదుర్కొనేందుకు ఈ సంయుక్త వ్యూహం బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ ఐడియాలకు కీలకంగా మారనుంది. టెలికాం రంగంలో ఈ పరిణామం కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశముందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Sthanikam

బీఎస్‌ఎన్‌ఎల్–వొడాఫోన్ ఐడియా కలయిక… టెలికాం రంగంలో కొత్త సమీకరణాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News