Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సంగారెడ్డి

బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న 16వ వార్డు ప్రచారం

Updated : 04 Feb 2026 18:50 IST
As Preferred Source 1 min read
బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న 16వ వార్డు ప్రచారం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ తరఫున 16వ వార్డు అభ్యర్థిగా బలపరిచిన బూరిగారి విజయలక్ష్మీ వెంకట్ రెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్, మాజీ ఎస్సీ–ఎస్టీ కమిషన్ చైర్మన్ ఏరోళ్ళ శ్రీనివాస్, పటాన్ చెరు మండల ఇంచార్జ్, మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ పాల్గొని ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ కరపత్రాలను అందజేశారు.ప్రజల నుండి మంచి స్పందన లభించగా, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ నాయకులు పిలుపునిచ్చారు.ప్రజల ఆశీర్వాదంతో ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని ఈ సందర్భంగా వారు ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న 16వ వార్డు ప్రచారం

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news