Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:19 AM

బీఆర్ఎస్, బీజేపీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

01-02-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన పలువురు నాయకులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. సూర్యాపేట మాజీ జడ్పిటిసి, మాజీ సర్పంచ్ బోడ రాములు కుమారుడు, ఇరవై ఎనిమిదవ వార్డు స్వతంత్ర అభ్యర్థి బోడ రామ్ హేమంత్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఆయనతో పాటు తప్పెట్ల తిరుపతిరావు కూడా పార్టీలో చేరారు.అలాగే నలభై ఒకటవ వార్డుకు చెందిన గావాన్ పాషా బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వివిధ పార్టీల నుంచి నాయకులు చేరడం శుభపరిణామమని వట్టె జానయ్య యాదవ్ అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పనిచేసే పార్టీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరింత బలపడుతుందని, రాబోయే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, నాయకులు అనపర్తి రాజేష్, బోడపట్ల మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీఆర్ఎస్, బీజేపీ నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News