Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:22 AM

బీదర్-జహీరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి-కొడుకు దుర్మరణం, మొత్తం ఐదుగురు మృతి

13-05-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ / బీదర్: తెలంగాణ–కర్ణాటక సరిహద్దులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బీదర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు జహీరాబాద్–బీదర్ రహదారిపై శంషల్లాపూర్ సమీపంలో ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ దారుణ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదంలో తెలంగాణలోని మిర్జాపూర్(బి) గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన తండ్రి-కొడుకులు నర్సింహులు (48), అరుణ్ (20) అక్కడికక్కడే మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. బస్సు బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు న్యాల్కల్ మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న దాదాపు 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను బీదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ధాటికి బస్సు పూర్తిగా ధ్వంసమై అద్దాలు చెల్లాచెదురయ్యాయి.ఘటనతో బీదర్–జహీరాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.ఈ దుర్ఘటన తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

Sthanikam

బీదర్-జహీరాబాద్ హైవేపై ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి-కొడుకు దుర్మరణం, మొత్తం ఐదుగురు మృతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News