Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

బీబీనగర్ ఎయిమ్స్‌లో 6వ ఇన్‌స్టిట్యూట్ బాడీ సమావేశం

20-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- పరిపాలన బలోపేతానికి కీలక నిర్ణయాలు: ఎంపీ చామల

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్:All India Institute of Medical Sciences Bibinagar (ఎయిమ్స్), బీబీనగర్‌లో జరిగిన 6వ ఇన్‌స్టిట్యూట్ బాడీ సమావేశంలో ఎయిమ్స్ బోర్డు సభ్యులు,భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇన్‌స్టిట్యూట్ బాడీ అధ్యక్షులు చంద్రశేఖర్ మహాదేర మేశ్రం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో గవర్నింగ్ బాడీ,స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ,స్టాండింగ్ అకడమిక్ కమిటీ,స్టాండింగ్ సెలెక్షన్ కమిటీ,స్టాండింగ్ ఎస్టేట్ కమిటీ మరియు హ్యూమన్ రిసోర్స్ సబ్ కమిటీ ఏర్పాటు అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్,ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితా అగర్వాల్,సభ్యులు త్రితంకర్ దేబ్, Postgraduate Institute of Medical Education and Research ఇంటర్నల్ మెడిసిన్ విభాగాధిపతి సంజయ్ జైన్,అలాగే KEM Hospital & Research Centre డైరెక్టర్ C.S.యజనిక్ పాల్గొన్నారు.ఈ కమిటీల ఏర్పాటు ద్వారా సంస్థ పరిపాలన మరింత బలోపేతం కావడం,ఆర్థిక పారదర్శకత పెరగడం,విద్యా ప్రమాణాలు మెరుగుపడడం, నియామక ప్రక్రియ సక్రమీకరణతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ చామల తెలిపారు.తెలంగాణలో అత్యున్నత వైద్య సేవలు,వైద్య విద్య మరియు పరిశోధన రంగాలలో ఎయిమ్స్ బీబీనగర్ మరింత పురోగమించేందుకు ఈ చర్యలు కీలకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.

Sthanikam

బీబీనగర్ ఎయిమ్స్‌లో 6వ ఇన్‌స్టిట్యూట్ బాడీ సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News