Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

బీఆర్‌ఎస్ సభ రైతు హంతకుల సభలా ఉంది.డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ధ్వజం

19-05-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సభ రైతు హంతకుల సభను తలపించిందని డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత విమర్శించారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులను మోసం చేసి తమ ఖజానాలు నింపుకున్నారని ఆరోపించారు. లక్ష రూపాయల రుణమాఫీ పేరుతో రైతులను ముంచేశారని, ఆ పాలనలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ప్రజలు మరిచిపోలేదన్నారు. ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీలు వేసిన ఘటన ఇప్పటికీ ప్రజల మదిలో ఉందన్నారు.

“వరి వేస్తే ఉరి” అంటూ రైతులను భయపెట్టిందీ కేసీఆరేనని, రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతుగా నిలిచిందని ఆరోపించారు. నల్గొండ జిల్లాలో మిల్లర్లతో కుమ్మక్కై అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు.

ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్, రూ.2 లక్షల రుణమాఫీ, ప్రతి క్వింటాకు రూ.500 బోనస్ అందిస్తూ రైతు సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తి చేస్తూ 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు.

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించిన ఆయన.. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తులో స్థానం ఉండదన్నారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యాల రవీందర్‌రెడ్డి, బోడ స్వామి, పగిళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీఆర్‌ఎస్ సభ రైతు హంతకుల సభలా ఉంది.డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ధ్వజం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News