Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:24 AM

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీరు విడుదల

08-01-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి పంటలకు జీవం పోసిన నీరు

సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి స్థానికం ప్రతినిధి కిరణ్

ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలో రైతులకు శుభవార్త. పంటలకు జీవం పోసినట్లు బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు సాగునీటిని బుధవారం అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గౌరవ శ్రీ మందుల సామేలు గారు మాట్లాడుతూ, రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశారు. నీరు చివరి ఎకరం వరకు చేరేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో నియోజకవర్గంలోని రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది.

పంటలకు తగినంత నీరు అందడంతో దిగుబడులపై ఆశలు పెరిగాయని రైతులు తెలిపారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Sthanikam

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీరు విడుదల

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News