Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:36 AM

బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలి..​

25-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

పేదలకు రుణాల మంజూరులో జాప్యం వద్దు..

బ్యాంకర్లకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం..

రూ. 16,861 కోట్లతో నాబార్డ్ రుణ ప్రణాళిక విడుదల..

​నల్గొండ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత రంగ పథకాల గ్రౌండింగ్‌ లక్ష్యాలను బ్యాంకర్లు వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ (డి.సి.సి) సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్, డిసెంబర్ త్రైమాసికాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనపై బ్యాంకుల నియంత్రణ అధికారులు, జిల్లా అధికారులతో కలిసి ఆయన కూలంకషంగా సమీక్షించారు.గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు బ్యాంకులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ముఖ్యంగా.. వ్యవసాయ రుణాలు, చిన్న మధ్యతరహా పరిశ్రమలు (MSME), టర్మ్ లోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. డి.ఆర్.డి.ఏ, మెప్మా, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా అందజేసే రుణాల గ్రౌండింగ్‌ను ఈ నెల 30 లోపు పూర్తి చేయాలి. ఆర్‌సెటీ (RSETI) ద్వారా శిక్షణ పొందిన అతి పేదవారు, చిరు వ్యాపారుల రుణ దరఖాస్తులను బ్యాంకర్లు 'పెద్ద మనసుతో' ఆలోచించి జాప్యం లేకుండా మంజూరు చేయాలని సూచించారు.

రుణాల మంజూరులో వేగం పెంచాలి..

​గృహ నిర్మాణం, విద్యా రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) వంటి బ్యాంకులు విద్యార్థులకు ఇచ్చే రుణాలపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే పశుసంవర్ధక శాఖ ద్వారా జారీ చేసే కిసాన్ క్రెడిట్ కార్డుల విషయంలో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నాబార్డ్ ఆధ్వర్యంలో రూపొందించిన 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సామర్థ్య ఆధారిత రుణ ప్రణాళిక (PLP) పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. వచ్చే ఏడాదికి గాను మొత్తం రూ. 16,861 కోట్ల అంచనాతో ఈ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.సమావేశంలో ఆర్.బి.ఐ ఎల్.డి.ఓ గోమతి, నాబార్డ్ డి.డి.ఎమ్ వినయ్, డీసీసీబీ సీఈఓ శంకర్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, బ్యాంకుల నియంత్రణ అధికారులు పాల్గొన్నారు

Sthanikam

బ్యాంకర్లు నిర్దేశిత లక్ష్యాలను పూర్తి చేయాలి..​

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News