Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:29 AM

బురద మడిలో మునిగి రైతు మృతి

బురద మడిలో మునిగి రైతు మృతి

బురద మడిలో మునిగి రైతు మృతి
29-12-2025 501 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేటలో అనుమానాస్పద ఘటన

రామన్నపేట:స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోబనద్రిపురం గ్రామానికి చెందిన రైతు బోడిగే నరేష్ (35) బురద మడిలో మునిగి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. 28.12.2025న నరేష్ మధ్యాహ్నం సమయంలో ప్రతిరోజులాగే తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడికి ఫోన్ చేయగా స్పందన లేకపోయింది. దీంతో భార్య బోడిగే మాధవి ఆందోళన చెంది తన బావ బోడిగే రమేష్‌కు సమాచారం ఇచ్చింది.

వారు ఇద్దరూ సాయంత్రం సుమారు 5.20 గంటలకు పొలం వద్దకు వెళ్లి వెతకగా, ముత్యాలమ్మ గుడి వెనుక ఉన్న బురద మడిలో నరేష్ మునిగి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నరేష్ ప్రమాదవశాత్తు బురదలో జారి పడి మృతి చెందినాడా? లేక మరే ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు రామన్నపేట ఎస్‌ఐ డి. నాగరాజు తెలిపారు.

Sthanikam

బురద మడిలో మునిగి రైతు మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News