Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:19 PM

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి

10-04-2026 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​- వంతెన నిర్మాణంతో ప్రజలకు తప్పని తిప్పలు

​- పట్టణ భవిష్యత్తు దృష్ట్యా కీలకమని విజ్ఞప్తి

​చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో ప్రజలు, వాహనదారుల సౌకర్యార్థం వెంటనే భూగర్భ రహదారి (అండర్‌ పాస్‌) నిర్మించాలని 17వ వార్డు కౌన్సిలర్‌ చింతల ఉమామహేశ్వరి కోరారు. ఈ మేరకు గురువారం ఆమె మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. 65వ నంబరు జాతీయ రహదారిపై ప్రస్తుతం జరుగుతున్న వంతెన నిర్మాణ పనుల వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.పైలాన్‌ పార్కు నుంచి అంబేడ్కర్‌ చౌరస్తా వరకు మట్టితో వంతెన నిర్మిస్తున్నారని, కెనరా బ్యాంకు వద్ద అండర్‌ పాసింగ్‌ సౌకర్యం కల్పించారని కౌన్సిలర్‌ పేర్కొన్నారు. అయితే, నిత్యం వేలాది మంది ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్‌ ప్రాంతంలో అండర్‌ పాస్‌ లేకపోవడం శోచనీయమన్నారు. దీనివల్ల 16, 17, 18, 20 వార్డుల ప్రజలతో పాటు బంగారిగడ్డ వాసులు రోడ్డు దాటాలంటే కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించాల్సి వస్తోందని వివరించారు.బస్టాండ్‌లో దిగిన మహిళలు, వృద్ధులు రోడ్డు దాటడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చౌటుప్పల్‌ నియోజకవర్గ కేంద్రంగా రూపాంతరం చెందే అవకాశం ఉన్నందున, ఇప్పటి నుంచే శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ప్రజా అవసరాలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన బస్టాండ్‌ వద్ద అండర్‌ పాస్‌ ఏర్పాటుకు కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

Sthanikam

బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News