Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

బ్రతికి ఉంటే ఏదైనా సాధించవచ్చు… బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు:సిఐ వెంకట్ రెడ్డి

02-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ,తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చన్న భ్రమలో యువత,విద్యార్థులు అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌, గేమింగ్ యాప్స్‌కు బానిసలుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇలాంటి యాప్స్‌ వల్ల యువత తీవ్ర అప్పులపాలై, చివరకు తమ ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారని ఆయన తెలిపారు.ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల మాటున ప్రమాదకరమైన మాల్‌వేర్ ఉండే అవకాశం ఉందని, ఫేక్ లింక్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ అకౌంట్ వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని

హెచ్చరించారు.గతంలో కూడా బెట్టింగ్‌కు బానిసలై పలువురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయని గుర్తు చేశారు.యువత, విద్యార్థులు ఇలాంటి అక్రమ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.“బ్రతికి ఉంటే ఏదైనా సాధించవచ్చు. కానీ తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో బెట్టింగ్ జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దు.ఇలాంటి యాప్‌లకు దూరంగా ఉండి, భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి” అని సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి యువతకు హితవు పలికారు.

Sthanikam

బ్రతికి ఉంటే ఏదైనా సాధించవచ్చు… బెట్టింగ్ జోలికి వెళ్లొద్దు:సిఐ వెంకట్ రెడ్డి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News