Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 06:48 AM

బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల్లో దళిత సర్పంచుల పేర్లు తొలగింపు. కొడారి వెంకటేష్

09-02-2026 541 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బహుజనులకు అవమానం – మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారం, భువనగిరి మండలం బండసోమారం గ్రామాల్లో నిర్వహించిన శివరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల్లో గ్రామ సర్పంచుల పేర్లు ముద్రించకపోవడం దళిత–బహుజన వర్గాలకు తీవ్ర అవమానమని జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు బర్రె సుదర్శన్, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ తీవ్రంగా ఖండించారు.సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ, పడమటి సోమారం గ్రామంలో శ్రీ లింగభసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలో గ్రామ సర్పంచ్ బద్దం అంజయ్య పేరు ఉద్దేశపూర్వకంగా తొలగించారని ఆరోపించారు. అదే విధంగా బండసోమారం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికలో గ్రామ సర్పంచ్ కాటిక జంగయ్య పేరు ముద్రించకపోవడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు.గ్రామ సర్పంచ్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవని, గ్రామ ప్రథమ పౌరునిగా ఆయనకు ఉండాల్సిన గౌరవాన్ని కాలరాయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. దళితుడు సర్పంచ్ కావడమే కారణంగా ఈ విధమైన అవమానాలకు పాల్పడటం రాజ్యాంగ విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు.కొంతమంది వ్యక్తుల ఒత్తిళ్లకు లోబడి అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు, ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే బాధ్యులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

దేవాలయ ఉత్సవాలు సమానత్వానికి ప్రతీక కావాల్సిన సందర్భంలో వివక్షకు వేదికలుగా మారడం బాధాకరమని, దళిత–బహుజన గౌరవాన్ని కాపాడేందుకు ఉద్యమిస్తామని వారు స్పష్టం చేశారు.

Sthanikam

బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికల్లో దళిత సర్పంచుల పేర్లు తొలగింపు. కొడారి వెంకటేష్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News