Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:42 AM

బోరంచలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి తీర్మానం

05-01-2026 266 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

గ్రామాభివృద్ధిలో మరో అడుగు: బోరంచలో మహిళా సమాఖ్య భవనం

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షేట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప అధ్యక్షతన, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్, గ్రామ వార్డు సభ్యులు సమక్షంలో సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మహిళా సమాఖ్య భవనాలు మంజూరు కావడంతో, బోరంచ గ్రామంలో మహిళా సమాఖ్య భవనం నిర్మాణానికి సంబంధించిన అంశంపై విస్తృతంగా చర్చించారు. అనంతరం గ్రామ అభివృద్ధిలో భాగంగా మహిళా సమాఖ్య భవనం మంజూరుకు గ్రామ పంచాయతీ తరఫున ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.చేసిన తీర్మానాన్ని గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప, ఉపసర్పంచ్ మొల్ల కరిమ్ చేతుల మీదుగా గ్రామ మహిళా సమాఖ్య అధ్యక్షులు సాయమ్మ, సభ్యులు రుక్మిణి, గ్రామ మహిళా సమాఖ్య వీఓఏకు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు మహిళా సమాఖ్య భవనం ఎంతో ఉపయోగపడుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్థులు తదితరులు పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

బోరంచలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి తీర్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News