Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:28 AM

బోరంచ పాఠశాలలో రామానుజన్‌కు ఘన నివాళులు

బోరంచ పాఠశాలలో రామానుజన్‌కు ఘన నివాళులు

బోరంచ పాఠశాలలో రామానుజన్‌కు ఘన నివాళులు
22-12-2025 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోరంచ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

స్థానిక ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్

ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని సోమవారం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కార్యక్రమం ప్రారంభంలో రామానుజన్ చిత్రపటానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయ బృందం, గణిత శాస్త్రం బోధిస్తున్న ఉపాధ్యాయులు మహేష్ కుమార్, నర్సప్పలను శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణితంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమాలు విద్యార్థుల్లో మంచి ఉత్సాహాన్ని కలిగించాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచ పాఠశాలలో రామానుజన్‌కు ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News