Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:14 AM

బోగారంలో రాజకీయ భూకంపం: బీఆర్ఎస్‌లో 300 మంది చేరిక, కాంగ్రెస్‌కు భారీ షాక్

16-12-2025 109 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోగారంలో కాంగ్రెస్‌కు గట్టి షాక్… బీఆర్ఎస్‌లో 300 మంది చేరిక

స్థానికం ప్రతినిధి రామన్నపేట

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గ్రామ నూతన సర్పంచ్ కూనూరు సాయి కుమార్ గౌడ్ నాయకత్వంలో సుమారు 300 మంది కాంగ్రెస్ శ్రేణులు మంగళవారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ భారీ చేరికల కార్యక్రమానికి బీఆర్ఎస్ మండల నాయకుడు అంతటి పద్మా రమేశ్ గౌడ్ సారథ్యం వహించారు.

ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో కూనూరు సాయి కుమార్ గౌడ్ బీఆర్ఎస్‌లో చేరి సర్పంచ్‌గా పోటీచేసి భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. చిరుమర్తి లింగయ్యకు ఇచ్చిన మాట ప్రకారం గెలుపు అనంతరం పెద్ద ఎత్తున జనబలంతో మరోసారి కండువా కప్పుకుని తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య శాలువాలతో సర్పంచ్ సాయి కుమార్ గౌడ్‌తో పాటు ఉప సర్పంచ్ బైకాని ఉమా మహేశ్, వార్డ్ మెంబర్లు గోగు ప్రమీల రమేశ్, మేడి ఆంజనేయులు, నేరడి మానస సురేశ్, కడారి పావని పాపయ్య, వనం అండాలు యాదగిరిలను ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకులు బద్దుల ఉమా రమేశ్ యాదవ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. బోగారంలో జరిగిన ఈ భారీ చేరికలు కాంగ్రెస్ శిబిరానికి గట్టి ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Sthanikam

బోగారంలో రాజకీయ భూకంపం: బీఆర్ఎస్‌లో 300 మంది చేరిక, కాంగ్రెస్‌కు భారీ షాక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News