Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:25 AM

బాలిక రక్షణను గాలికొదిలేశారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: బీఆర్‌ఎస్‌ నేత స్వాతి

13-05-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో బాధిత బాలికకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ యాదగిరిగుట్ట మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కళ్ళెం స్వాతి ఆరోపించారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనపై చూపుతున్న శ్రద్ధను బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం చూపడం లేదని విమర్శించారు. పోక్సో కేసుల్లో సాధారణంగా 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్‌ చేస్తారని, అయితే భగీరథ్‌ విషయంలో మూడు, నాలుగు రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం ఎందుకని ప్రశ్నించారు.

సామాన్యులకు ఒక చట్టం, కేంద్ర మంత్రుల కుటుంబ సభ్యులకు మరో చట్టమా అని నిలదీశారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

బాధిత బాలికకు న్యాయం జరిగేలా వెంటనే బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తన నిజాయితీని నిరూపించుకోవాలంటే కేంద్ర మంత్రి పదవితో పాటు ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలని కోరారు.

Sthanikam

బాలిక రక్షణను గాలికొదిలేశారు. బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి: బీఆర్‌ఎస్‌ నేత స్వాతి

Article Image

యాదాద్రి భువనగిరి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసులో బాధిత బాలికకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ యాదగిరిగుట్ట మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కళ్ళెం స్వాతి ఆరోపించారు.

మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనపై చూపుతున్న శ్రద్ధను బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం చూపడం లేదని విమర్శించారు. పోక్సో కేసుల్లో సాధారణంగా 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్‌ చేస్తారని, అయితే భగీరథ్‌ విషయంలో మూడు, నాలుగు రోజులు గడిచినా చర్యలు తీసుకోకపోవడం ఎందుకని ప్రశ్నించారు.

సామాన్యులకు ఒక చట్టం, కేంద్ర మంత్రుల కుటుంబ సభ్యులకు మరో చట్టమా అని నిలదీశారు. ఈ అంశంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కుమారుడు కావడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

బాధిత బాలికకు న్యాయం జరిగేలా వెంటనే బండి భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తన నిజాయితీని నిరూపించుకోవాలంటే కేంద్ర మంత్రి పదవితో పాటు ఎంపీ స్థానానికి రాజీనామా చేయాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News