Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

బాలల హక్కులకు భంగం కలిగించే మీ ప్రవచనాలు మానుకోవాలి

21-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రాజ్యాంగం ప్రకారం లభించిన హక్కులను విమర్శిస్తే దేశ ద్రోహమే

-బాలల హక్కుల సంఘం కొడారి వెంకటేష్

"అన్నంలో గుడ్డు పెట్టడం ఏంటండీ! చదువుతే చదవమనండి,లేకపోతే వెళ్ళి పొమ్మని చెప్పండి!" అని ప్రవచనాలు పలికిన గరికపాటి నరసింహారావు,తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంరించుకోవాలని బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగం,సుప్రీంకోర్టు ఆదేశానుసారం దేశంలోని బాలబాలికలు అందించే పౌష్టికాహారం,ఏకరూప దుస్తులు, ఉచిత పుస్తకాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.భారత రాజ్యాంగం ఆర్టికల్ 21(రైట్ టు లైఫ్) ప్రకారం మనదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారం జీవించడం అంటే కేవలం బతకడం కాదు.గౌరవంగా బతకడం,ఆరోగ్యం,పోషకాహారం,కనీస జీవన ప్రమాణాలు అందులో ఇమిడి ఉన్నాయని గ్రహించాలని ఆయన అన్నారు.అంటే ప్రభుత్వం జనాలకు రేషన్ ఇవ్వడం,పిల్లలకు పౌష్టికాహారం అందించడం దానమో,దయో కాదు,రాజ్యాంగం కల్పించిన హక్కు ఆరోగ్యంగా జీవించడానికి అనువైన హక్కు 2001లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఆదేశం ఇచ్చింది. పిల్లలకు డ్రై రేషన్ కాదు వారికి వండిన భోజనం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.దీంతోనే "మధ్యాహ్న భోజనం పథకం"(మిడ్ డే మీల్స్) అమల్లోకి వచ్చిందని ఆయన అన్నారు.పిల్లలందరికీ పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వాలను ఆదేశించింది.దేశంలోని 146 కోట్ల జనాభాలో 12 శాతం జనాభా పోషకాహారం లోపంతో బాధపడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి.దేశంలోని సుమారు యాభై కోట్ల మంది పిల్లల్లో 32.9 శాతం మంది పిల్లలు వయసుకు తగిన ఎత్తు ఎదగక పోవడానికి,18.7 శాతం మంది పిల్లలు వయసుకు తగిన బరువు లేకపోవడానికి ప్రధాన కారణం పోషకాహారం తీసుకోకపోవడమే అని నిపుణులు సూచిస్తున్నారని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం ఆకలి వల్ల ఎవ్వరూ కూడా చనిపోవడం లేదని చెబుతున్నారు. ఆకలి వల్ల ఎవ్వరూ చనిపోవడం లేదు.వాస్తవమే కానీ చనిపోయే వారంతా ఆకలి వల్ల వచ్చిన జబ్బుల వల్ల అని (గుర్తించడం)తెలుసుకోవడం మన విజ్ఞత కు నిదర్శనమని ఆయన అన్నారు.గరికపాటి వారు పిల్లల హక్కులపై మాట్లాడే ముందు పిల్లల హక్కులకు భంగం కలిగించే వారి గురించి మాట్లాడితే బాగుండేది. పిల్లల పౌష్టికాహార విషయంలో చేసే స్కాముల గురించి,పిల్లల నోటి కాడి ముద్దను మిగుల్చుకునే కమీషన్ దారుల గురించి మాట్లాడితే బాగుండేదని ఆయన అన్నారు.తమరు ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదని, ప్రభుత్వ ఏజెంటుగా చెబుతున్నారు సంతోషం. కానీ వందల,వేల కోట్ల రూపాయలు పొలిటీషియన్ ల ఆస్తులుగా ఎలా మారుతుందో మీరు సమాధానం చెబుతారా? అని గరికపాటిని ఆయన ప్రశ్నించారు. మనిషిగా బతుకుతున్నందుకైనా కనీసం పిల్లల మీదైనా కాస్తా బాధ్యతతో మాట్లాడాలని ఆయన హితవు పలికారు.నేటి బాలలే రేపటి పౌరులని పిల్లలే మన జాతి సంపద అని గుర్తించాలని ఆయన అన్నారు.

Sthanikam

బాలల హక్కులకు భంగం కలిగించే మీ ప్రవచనాలు మానుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News