Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:58 AM

బాక్సింగ్ టోర్నమెంట్‌లో విజేతలకు మెడల్స్ అందజేసిన రాజ్‌కుమార్ రెడ్డి

18-05-2026 359 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, నగరంలోని శ్రీ హనుమాన్ వ్యాయంశాల హైస్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం హెచ్‌వీఎస్ కాంబాట్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరమన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని పేర్కొన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.

పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణకు తన వంతు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుంటానని రాజ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నిర్వాహకులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

బాక్సింగ్ టోర్నమెంట్‌లో విజేతలకు మెడల్స్ అందజేసిన రాజ్‌కుమార్ రెడ్డి

Article Image

హైదరాబాద్, నగరంలోని శ్రీ హనుమాన్ వ్యాయంశాల హైస్కూల్ గ్రౌండ్‌లో ఆదివారం హెచ్‌వీఎస్ కాంబాట్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమానంగా అవసరమన్నారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెరుగుతుందని పేర్కొన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.

పోటీలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ఆయన అభినందించారు. అనంతరం విజేతలకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి క్రీడా పోటీల నిర్వహణకు తన వంతు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుంటానని రాజ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, నిర్వాహకులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News