Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:09 PM

బైరామాల్ గూడ ఫ్లైఓవర్‌కు మహాత్మా జ్యోతిబాపూలే పేరు పెట్టాలి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ

14-02-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: ఎల్బీనగర్ పరిధిలోని బైరామాల్ గూడ పైవంతెనకు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టాలని తెలంగాణ రాజ్యాధికార సంఘం ప్రభుత్వాన్ని కోరింది. సంఘం ఎల్బీనగర్ నియోజకవర్గ బాధ్యులు బొంగు వెంకటేష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ సందర్భంగా మాట్లాడారు.

సమాజ సంస్కర్తలైన మహాత్మా జ్యోతిరావు ఫూలే మరియు సావిత్రిబాయ్ ఫూలే లు విద్య ద్వారానే సమాజంలో శాశ్వత మార్పు సాధ్యమని శతాబ్దం క్రితమే బోధించారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మహనీయుడైన జ్యోతిరావు పూలేకు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ప్రజా నిర్మాణాలకు పేర్లు నిర్ణయించే విషయంలో వ్యక్తిగత ప్రయోజనాలు కాకుండా సమాజానికి సేవచేసిన మహనీయుల సేవలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. ఎలాంటి త్యాగం లేకుండా కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పేర్లు ప్రతిపాదించడం సముచితం కాదని హితవు పలికారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్‌కు మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఎల్బీనగర్ ప్రాంతంలో వెనుకబడిన వర్గాల ప్రజలు అధికంగా ఉన్నందున బైరామాల్ గూడ పైవంతెనకు కూడా పూలే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎల్బీనగర్ ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార సంఘం యువజన విభాగం అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్, హైదరాబాద్ బాధ్యులు బావన, మేడ్చల్–మల్కాజిగిరి యువజన విభాగం అధ్యక్షుడు, రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పాకాల నరసింహ, సింగం అరుణ్, ఎన్‌టీఆర్ నగర్ విభాగం అధ్యక్షుడు సంపత్ ప్రసాద్, కొత్తపేట విభాగం అధ్యక్షుడు స్వామి ముదిరాజ్, నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

బైరామాల్ గూడ ఫ్లైఓవర్‌కు మహాత్మా జ్యోతిబాపూలే పేరు పెట్టాలి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News