Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:31 AM

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి
08-12-2025 193 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

స్థానిక ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ఎన్నికలలో గ్రామ సర్పంచులుగా, వార్డు సభ్యులుగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే ఈ మండలంలో కనిపిస్తుందని, రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిప్పి కొట్టాల్సిన సమయం ఇదేనని ఆయన తెలిపారు. రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. బిఆర్ఎస్, సీపీఐ(ఎం) పార్టీ బలపర్చిన వార్డు సభ్యులను గెలిపించాలనిఆయన కోరారు. ఆయన వెంట సర్పంచ్ అభ్యర్థి మిర్యాల మల్లేష్, మాజీ ఎంపిటిసి లు గొరిగే నరసింహ, వేమవరం సుధీర్ బాబు, నాయకులు బందెల రాములు, పోతరాజు సాయికుమార్, సీపీఐ(ఎం) నాయకులు కందుల హనుమంతు, భావన్లపల్లి బాలరాజు, గోరిగే సోములు, తదితరులున్నారు.

Sthanikam

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News