Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:43 AM

బిఆర్ఎస్ విజయమే ప్రజల ఆశయానికి నిదర్శనం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

17-12-2025 486 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్‌లో నూతన సర్పంచ్‌లకు ఘన సన్మానం

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నార్కట్‌పల్లి పట్టణ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన ప్రజాప్రతినిధులను శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

గ్రామాల అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తే ప్రజల నమ్మకం మరింత బలపడుతుందని చిరుమర్తి లింగయ్య సూచించారు. బిఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఉంచిన విశ్వాసానికి ఈ విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట మండలం బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయి కుమార్, లక్ష్మాపురం సర్పంచ్ పులిపలుపుల సునీత వీరస్వామి, పల్లివాడ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాస్, కుంకుడుపాముల సర్పంచ్ గొలుసుల సత్తయ్యలను ఆయన సన్మానించారు. అలాగే కట్టంగూరు మేజర్ గ్రామ పంచాయతీ బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ ముక్కాముల శేఖర్ శ్యామల, చిట్యాల మండలం గుండ్రాంపల్లి సర్పంచ్ బత్తుల లక్ష్మీ ప్రసన్నలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమం నూతన ప్రజాప్రతినిధుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని, గ్రామాల సమగ్ర అభివృద్ధికి కలిసి కట్టుగా పనిచేస్తామని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Sthanikam

బిఆర్ఎస్ విజయమే ప్రజల ఆశయానికి నిదర్శనం: మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News