Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:15 PM

బహుజనుల చేతుల్లోనే రాజ్యాధికారం రావాలి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్

08-02-2026 228 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఓటర్లుగా కాదు… పాలకులుగా బహుజనులు ఎదగాలి

రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో బహుజన రాజ్యాధికారం సాధ్యం

విద్య, వైద్యం, ఉపాధికి బహుజన పాలనే మార్గం

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మూడు వార్డుల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షులు శేఖర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బహుజనులు కేవలం ఓటర్లు మాత్రమే కాకుండా పాలకులుగా ఎదగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.బహుజన రాజ్యాధికారం సాధ్యమైతే విద్య, వైద్యం, ఉపాధి, నిరుద్యోగ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. పేదల తలరాతలు మార్చడానికే భారత రాజ్యాంగం రూపకల్పన జరిగిందని, రాజ్యాంగం ద్వారా పేదలకు ఓటు హక్కు కల్పించి పాలనలో భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు.ఒకప్పుడు ఓటు హక్కు పెత్తందారులు, భూస్వాములకే పరిమితమై ఉండేదని, వెనుకబడిన కులాలు వెలుగులోకి రావాలంటే రాజకీయ అధికారంలోకి రావడం తప్పనిసరి అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అందాలన్నా, సమాజంలో గౌరవం పెరగాలన్నా బహుజనులు అన్ని రాజకీయ పార్టీలతో పోటీ పడుతూ గెలిచి పాలకులుగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి బీఎస్పీ నాయకులు పాల్గొనగా, భారీ సంఖ్యలో ప్రజలు హాజరై శేఖర్‌కు ఘన స్వాగతం పలికారు.

Sthanikam

బహుజనుల చేతుల్లోనే రాజ్యాధికారం రావాలి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శేఖర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News