Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:55 AM

బీసీలకు చట్టబద్ధమైన బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలి

08-01-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

టీఆర్‌పీ పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దారులకు వినతిపత్రం

చిట్యాల స్థానికం ప్రతినిది ప్రశాంత్

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల (బీసీ) సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన “బీసీ సబ్‌ప్లాన్”ను తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పాకాల నరసింహ డిమాండ్ చేశారు.టీఆర్‌పీ పార్టీ వ్యవస్థాపకులు, అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు, రాష్ట్ర యువజన అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్ సూచనలతో బుధవారం మండల తహసీల్దారులకు వినతిపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా పాకాల నరసింహ మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు, చట్టపరమైన రక్షణ అత్యవసరమని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఇప్పటివరకు బీసీల కోసం బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయకుండా మిగులు చూపడం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శించారు.కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రతి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 50 శాతం పైగా నిధులు కేటాయించాలన్నారు.బీసీల కోసం కేటాయించిన నిధులు పక్కదారి పట్టకుండా ఉండాలంటే బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యారంగంలో ప్రతి మండలంలో బహుజన గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయాలని, విదేశీ విద్యా నిధి పథకాన్ని మరింత సరళతరం చేయాలని సూచించారు.నిరుద్యోగ బీసీ యువతకు, సంప్రదాయ కులవృత్తులపై ఆధారపడిన వారికి ఎలాంటి షరతులు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల గణనలో బీసీలకు సంబంధించిన నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని కోరారు.కేవలం నినాదాలతో కాకుండా నిధులతో కూడిన చట్టబద్ధమైన బీసీ సబ్‌ప్లాన్ ద్వారానే బీసీలకు నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ వీర్ల వేణు, హైదరాబాద్ జిల్లా యువజన వర్కింగ్ ప్రెసిడెంట్ సల్మాన్, సీనియర్ నాయకులు బంతి కిరణ్ కుమార్, రమేష్ నాయక్, బొడ్డుపల్లి మహేందర్, వెంకటాచారి, గణేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బీసీలకు చట్టబద్ధమైన బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News