Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

బీబీ నగర్ ఎయిమ్స్‌లో వైద్య సేవలపై కల్వకుంట్ల కవిత సమీక్ష

23-12-2025 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎయిమ్స్ అభివృద్ధి పనులు, రోగుల సేవలపై ప్రత్యేక దృష్టి

భువనగిరి స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌లోని ఎయిమ్స్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు.

వైద్య సదుపాయాలు, చికిత్స విధానాలు, రోగులకు అందిస్తున్న సేవల నాణ్యతపై కవిత ప్రత్యేక దృష్టి సారించారు. అదే సమయంలో ఎయిమ్స్‌ను సందర్శనకు వచ్చిన పాఠశాల విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కాసేపు మాట్లాడారు.

ఎయిమ్స్ బిల్డింగ్ మోడల్‌ను చూపిస్తూ జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను వైద్య అధికారులు వివరించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఎయిమ్స్ కీలకంగా మారుతున్న తీరును ఈ సందర్శన మరోసారి స్పష్టం చేసింది.

Sthanikam

బీబీ నగర్ ఎయిమ్స్‌లో వైద్య సేవలపై కల్వకుంట్ల కవిత సమీక్ష

Article Image

ఎయిమ్స్ అభివృద్ధి పనులు, రోగుల సేవలపై ప్రత్యేక దృష్టి

భువనగిరి స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్‌లోని ఎయిమ్స్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యాధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు.

వైద్య సదుపాయాలు, చికిత్స విధానాలు, రోగులకు అందిస్తున్న సేవల నాణ్యతపై కవిత ప్రత్యేక దృష్టి సారించారు. అదే సమయంలో ఎయిమ్స్‌ను సందర్శనకు వచ్చిన పాఠశాల విద్యార్థులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో కాసేపు మాట్లాడారు.

ఎయిమ్స్ బిల్డింగ్ మోడల్‌ను చూపిస్తూ జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను వైద్య అధికారులు వివరించారు. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఎయిమ్స్ కీలకంగా మారుతున్న తీరును ఈ సందర్శన మరోసారి స్పష్టం చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News