Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:50 AM

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే

11-04-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

విద్యతోనే సమాజ అభ్యున్నతి సాధ్యం – రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మొరిశెట్టి నివేదిత లక్షాది

జిల్లా కేంద్రం: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది పేర్కొన్నారు.శనివారం జిల్లా కేంద్రంలోని ఎంజి రోడ్డులో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడవాలని అన్నారు. మహిళల విద్య ప్రాముఖ్యతను అప్పుడే గుర్తించి, వారికి ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసిన గొప్ప సంస్కర్త అని తెలిపారు.

తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్య నేర్పించి, ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన మహానుభావుడు అని కొనియాడారు.

ఈ దేశంలో మహాత్మ అనే బిరుదు పొందినవారిలో ఒకరు మహాత్మా గాంధీ అయితే, మరొకరు మహాత్మ జ్యోతిరావు పూలే మాత్రమే అని తెలిపారు. సమానత్వ సమాజ స్థాపన, మహిళల విద్యాభివృద్ధి, మానవ హక్కుల పరిరక్షణలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నదని, జిల్లాలో అక్షరాస్యత పెంపు, ఆడపిల్లల విద్యాభివృద్ధి కోసం చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన మార్గంలో నడిచి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News