Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:48 PM

బడంపేట జాతరలో డా॥ సిద్దం ఉజ్వల్ రెడ్డి ప్రత్యేక పూజలు

23-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో

కోహీర్ మండలంలోని బడంపేట గ్రామంలో జరుగుతున్న రాచన్న స్వామి సమేత భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థాన జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ జాతరకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.ఈ జాతర మహోత్సవాల సందర్భంగా సోమవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డా॥ సిద్దం ఉజ్వల్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు, శాంతి, సౌభాగ్యం కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఉత్సవ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన రాచన్న స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, గ్రామాలు అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.జాతరను విజయవంతంగా నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు నాగిరెడ్డి, సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, అశ్విన్ పాటిల్, నథానెయల్, జగదీశ్వర్ రెడ్డి, పట్టణ సభ సభ్యుడు అరుణ్ కుమార్, అక్షయ్ జాడే, రాజు యాదవ్, నర్సింహా యాదవ్, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు జగదీశ్ స్వామి, శ్రీపాల్ రాజయ్య, రాజ్ కుమార్ తదితరులు, అనేక మంది నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

బడంపేట జాతరలో డా॥ సిద్దం ఉజ్వల్ రెడ్డి ప్రత్యేక పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News