Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:22 AM

బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

15-05-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని శంకరంపేట మండలం చిలపల్లి గ్రామంలో జరిగిన భారీ చోరీ ఘటనపై ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన రాములు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు చొరబడి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు మరియు నగదును అపహరించిన విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వారి నివాసానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి జరిగిన ఘటనపై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు కష్టపడి సంపాదించిన ఆస్తిని దోచుకోవడం అమానుషమని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి లోతైన విచారణ చేపట్టాలని, క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరించి నిందితులను త్వరగా పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల పరిధిలో రాత్రిపూట పోలీస్ గస్తీని పెంచడంతో పాటు అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. నిరుపేద కుటుంబానికి జరిగిన ఈ నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News