Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:10 AM

బడ్జెట్‌లో ఎంజీయూకి మొండిచేయి

బడ్జెట్‌లో ఎంజీయూకి మొండిచేయి

బడ్జెట్‌లో ఎంజీయూకి మొండిచేయి
March 20, 2026 09:20 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

బడ్జెట్ ప్రతులను దహనం చేసిన ఏబీవీపీ

నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో మహాత్మా గాంధీ యూనివర్సిటీని పూర్తిగా విస్మరించడంపై అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఎంజీయూ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు బడ్జెట్ ప్రతులను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ​అంకెల గారడీ తప్ప ప్రయోజనం లేదు

​ఈ నిరసన కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు కొంపల్లి సూర్య, నాగేష్ పాల్గొని ప్రసంగించారు. గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు బడ్జెట్‌ల మాదిరిగానే ఈసారి కూడా కేవలం "అంకెల గారడీ"తో ప్రజలను మభ్యపెట్టిందని వారు విమర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ​ మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 8 శాతం నిధులు మాత్రమే కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల పట్ల వివక్ష: ఉస్మానియా, చాకలి ఐలమ్మ యూనివర్సిటీలకు మినహా, ఎంజీయూతో సహా రాష్ట్రంలోని మిగిలిన యూనివర్సిటీలకు నిధుల కేటాయింపు శూన్యమని వారు ఆరోపించారు యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టుల రిక్రూట్‌మెంట్‌పై గానీ, నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ పైన గానీ బడ్జెట్‌లో ఎటువంటి ప్రస్తావన లేకపోవడం దారుణమన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని వారు పేర్కొన్నారు. విద్యారంగాన్ని వినాశనం చేసే దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, విద్యార్థి లోకం తగిన బుద్ధి చెబుతుందని వారు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News