Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:10 PM

బడ్జెట్‌లో దివ్యాంగులకు దిక్సూచి కావాలి – డాక్టర్ ఎన్. అశోక్

14-02-2026 258 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ సమాజంలో నిలబడేందుకు పోరాడుతున్నారని డాక్టర్ ఎన్. అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దివ్యాంగుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ లేనివిధంగా దివ్యాంగులకు రెండింతల నిధులు కేటాయించాలని కోరారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, ఆరోగ్యం, పింఛన్లు, సహాయక పరికరాలు వంటి అన్ని రంగాల్లో సమగ్ర సహాయం అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటికీ ప్రభుత్వాలు దివ్యాంగులను పట్టించుకోకపోవడంతో వారి సమస్యలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు మార్గదర్శకాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కనీస అవసరాలు కూడా నెరవేర్చని పరిస్థితిలో దివ్యాంగులు గౌరవప్రదమైన జీవితం గడపడం కష్టమవుతోందన్నారు.

అన్ని శాఖల్లో దివ్యాంగులకు కేటాయించిన ఉద్యోగాలను భర్తీ చేయకుండా, నియమ నిబంధనలు పాటించకపోవడం అన్యాయమని విమర్శించారు. తక్షణమే ఉద్యోగ నియామకాలు పూర్తి చేసి, ఆర్థికంగా బలపడేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ఈ బడ్జెట్‌లో కూడా తక్కువ నిధులు కేటాయిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టి దివ్యాంగుల హక్కుల కోసం పోరాటం చేయాల్సి వస్తుందని డాక్టర్ ఎన్. అశోక్ హెచ్చరించారు.

Sthanikam

బడ్జెట్‌లో దివ్యాంగులకు దిక్సూచి కావాలి – డాక్టర్ ఎన్. అశోక్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News