Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:29 AM

బాధిత కుటుంబానికి ఊరట: రూ.2.50 లక్షల సహాయం

29-12-2025 369 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రమాద బాధిత కుటుంబానికి ఎల్‌ఓసి చెక్కు అందజేత

రామన్నపేటలో రూ.2.50 లక్షల సహాయం

రామన్నపేట: స్థానికం ప్రతినిధి

రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన సింగనబోయిన నరేష్ ఇటీవల జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సహాయంగా మంజూరైన ఎల్‌ఓసి చెక్కు రూ.2,50,000ను నరేష్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవతో ప్రభుత్వం నుంచి ఈ ఆర్థిక సహాయం మంజూరైంది. గత కొద్ది రోజుల క్రితం కూడా రెండు సార్లు ఎల్‌ఓసి చెక్కులను బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. బాధితుని ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కుటుంబానికి అండగా నిలుస్తున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా నాయకుడు పూస బాలకిషన్ మాట్లాడుతూ, నరేష్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.

ప్రభుత్వ సహాయంతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకుల చొరవతో బాధిత కుటుంబానికి ఊరట లభిస్తోందని స్థానికులు తెలిపారు.

Sthanikam

బాధిత కుటుంబానికి ఊరట: రూ.2.50 లక్షల సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News