Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

17-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియ, తూకం విధానం, తరలింపు ఏర్పాట్లు తదితర అంశాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.అధికారులు సమన్వయంతో పని చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తార్పాలిన్లు, విశ్రాంతి స్థలం వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని సూచించారు.

చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, రైతుల ఖాతాల్లో 48 గంటల్లో డబ్బు జమ అయ్యేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News