Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:02 AM

అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రలను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రలను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

అయిటిపాముల ధాన్యం కొనుగోలు కేంద్రలను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
May 17, 2026 02:48 PM 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్‌, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి ధాన్యం సేకరణ, తూకం విధానం, తరలింపు ఏర్పాట్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాగునీరు, నీడ, తార్పాలిన్లు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల ఖాతాల్లో 48 గంటల్లోనే డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News